Nsnnews// కామారెడ్డి జిల్లా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బిగించుకుని పోతుంది. జిల్లా కేంద్రానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసిన దుండగుడు..తన కూతురు డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయిందంటూ.. డబ్బులు పంపించకపోతే అరెస్ట్ చేసి, ముంబాయికి తరలిస్తున్నట్టు బెదిరింపులకు పాల్పడ్డాడు. గమనించిన బాధిత వ్యక్తి..కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో…రవికుమార్‌కు వచ్చిన ఫోన్ మోసపూరితమైనదిగా గుర్తించారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తి నుండి వచ్చిన ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన తండ్రి..తన కుమార్తెకు ఫోన్ చేయగా తాను క్షేమంగా ఉన్నట్టు తెలిపిందన్నారు.
Latest news,Telugu news,Kamareddy District,Telangana news