Home తెలంగాణ సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన హీరో నాగర్జున || Hero Nagarjuna went to court over Surekha’s comments

సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన హీరో నాగర్జున || Hero Nagarjuna went to court over Surekha’s comments

0
సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన హీరో నాగర్జున || Hero Nagarjuna went to court over Surekha’s comments

 

Nsnnews// తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు అక్కినేని నాగార్జున. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, నాగచైతన్య, సమంత వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే కొండ సురేఖపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. తమ రాజకీయాల కోసం సినీ తారలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానేయ్యాలంటూ.. సోషల్ మీడియా వేదికగా సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ.. నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ.. పిటిషన్ దాఖలు చేశారు.  కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఏం జరిగిందో దాని గురించి, నేటి రాజకీయాలు, రాజకీయ నాయకులు, వారి ప్రవర్తనపై నా ఆలోచచనలు, భావాలను మంచి భాషలో వ్యక్తీకరించేందుకు కష్టపడుతున్నాను అనిఅన్నారు.. కొందరు రాజకీయ నాయకులకు నేను ఒకటి గుర్తు చేయాలని అనుకుంటున్నాను అని చెప్పిన ఆయన…మనల్ని చూసుకునేందుకు మాత్రమే వారికి ఓటు వేస్తున్నామన్నారు. మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల గురించి మాట్లాడాటానికి, ఉద్యోగాలు, శ్రేయస్సును తీసుకురావడానికి..ఆరోగ్యం, విద్య, సౌకర్యాలను మెరుగుపరచడం మొదలైన వాటి కోసం ఓట్లు వేస్తున్నాం. కానీ ఇలాంటి మాటల కోసం కాదంటూ.. దిగజారుడు రాజకీయాలు చాలు అంటూ ట్వీట్ చేశారు.

Latest news,Telugu news,Telangana news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here