Nsnnews// కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి బోయింగ్ కొత్త క్యాప్సూల్ సురక్షితంగా ఉందో లేదో ఈ వారాంతంలో నిర్ణయిస్తామని నాసా తాజాగా తెలిపింది. ఈ అంశంపై అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సహా ఇతర ఉన్నతాధికారులు శనివారం సమావేశం కానున్నారు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్‌మోర్.. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌లో జూన్ 5న ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వారంలోగా వారు తిరిగిరావాల్సి ఉంది. కానీ, ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాహకనౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది. దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది. అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Latest news,Telugu news,International news