Nsnnews// భాగస్వామ్య పెన్షన్ పథకం CPS స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం UPS అమలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. యూపీఎస్‌లో యూ అంటే.. యూటర్న్స్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి చాలా నిర్ణయాలపై వెనక్కి తగ్గుతూ వస్తోందన్నారు. వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కేంద్రం పంపిందని, బ్రాడ్ కాస్ట్ బిల్లును వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. లేటరల్ ఎంట్రీ ప్రకటన ఇచ్చి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిందని, యూపీఎస్ విషయంలోనూ అదే జరిగిందన్నారు ఖర్గే. ప్రతీ విషయంలోనూ ఎన్డీయే ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటోందని ఎక్స్ వేదిగా విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా స్పందించారు. తెల్లారితే కాంగ్రెస్ నేతలకు అబద్ధాలు ప్రచారం చేయడం పనిగా మారిపోయిందని విమర్శించారు. యూపీఎస్ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, వందలాది సమావేశాలు, నిపుణులతో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Latestnews, Telugunews, Contributory Pension Scheme, Unified Pension Scheme, Mallikarjuna Kharge…