Nsnnews// AP కృష్ణాజిల్లా: కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి పలువురికి గాయాలు. పాండిచ్చేరి నుండి భీమవరం రొయ్యల ఫీడ్ వెళ్తున్న కంటైనర్. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్ళరేవు నుండి కృత్తివెన్ను మండలం మునిపెడ వస్తున్న బొలెరో వ్యాన్ శీతనపల్లి వద్ద పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొని ఓవర్ టాక్ చేస్తూ కంటైనర్ ను ఢీ కొనడంతో ప్రమాదం. అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా గాయపడిన మరో ఆరుగురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి. ఐదుగురు పరిస్థితి విషమం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో రెండు మూడు కిలోమీటర్ల పొడవున నిలిచిపోయిన ట్రాఫిక్ సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు స్థానికులు.
Latestnews, Telugunews, Krishna District, Road Accident…