Home తెలంగాణ సీఎం హైడ్రాతో హైడ్రామా..!! || Hydrama with CM Hydra..!!

సీఎం హైడ్రాతో హైడ్రామా..!! || Hydrama with CM Hydra..!!

0
సీఎం హైడ్రాతో హైడ్రామా..!! || Hydrama with CM Hydra..!!

 

Nsnnews// హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రామా చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారిందన్న ఆయన.. రాజధాని బ్రాండ్ ఇమేజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చంపేశారని విమర్శించారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు హరీష్. కేంద్రం నుంచి వచ్చిన 8 వందల కోట్ల ఉపాధిహామీ నిధులు సైతం దారి మళ్లించినట్లు ఆరోపించిన హరీష్…కాంగ్రెస్​ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రేవంత్​రెడ్డి తీరుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కనీసం గ్రామాల్లో తిరగలేని పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. తొమ్మిది నెలల పాలనలోనే 2 నెలల పింఛన్లు మింగేశారని ధ్వజమెత్తారు. పారిశుద్ధ్య నిర్వహణ పడకేయడంతో వ్యాధులు పెరిగాయని, ఫార్మాసిటీ, మెట్రో రైలు విషయంలో రూటు మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 50శాతానికి మించి రైతు రుణమాఫీ కాలేదన్న ఆయన…కేవలం 21 లక్షల మంది రైతులకు మాత్రమే అయినట్టు వివరించారు. రైతులకు 100 శాతం రుణమాఫీ అయ్యేంతవరకు…పంట బీమా, భరోసా కల్పించకపోతే రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. గత ప్రభుత్వం హయాంలో ప్రతినెలా పల్లె ప్రగతికి నిధులు వచ్చాయని, ఇప్పుడేమో నిధులు కరవయ్యాయని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలను గ్రామాలను గాలికి వదిలేసి…హైడ్రా పేరిట డ్రామాలు చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిస్తున్న యూట్యూబ్​లు చూస్తే.. రేవంత్ రెడ్డికి వెన్నుల్లో వణుకు పుడుతొందని హరీశ్​రావు వ్యాఖ్యానించారు.

Latest news,Telugu news,Telangana news,Medak District

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here