Nsnnews// రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. రుణ మాఫీ చేయకుండా, సీఎం రైతులతో రణం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన.రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులందరీకి… రుణ మాఫీ జరిగేంతవరకు అండగా ఉంటామన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అంతకముందుకు ఆయన..యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. పాపం.. రేవంత్ రెడ్డి చేస్తే, దేవుడు ప్రజలను శిక్షించవద్దని శ్రీ లక్ష్మి నరసింహ స్వామీని వేడుకున్నట్టు చెప్పారు. యాదగిరిగుట్ట హరిత టూరిజం హోటల్ లో హరీష్ రావు మాట్లాడారు.అక్రమ కేసులతో రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు కూడా… చట్టానికి లోబడి పనిచేయాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణ మాఫీ పేరుతో… పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం ప్రజలను ఓట్లు అడిగారన్నారు హరీష్.రేవంత్ రెడ్డి దైవ ద్రోహానికి పాల్పడ్డారన్న ఆయన… సీఎం ఒకలా, మంత్రులు మరోలా రుణమాఫీపై ప్రకటనలు చేయడం వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పి, దేవుళ్ళ దగ్గర ప్రయశిత్తం చేసుకోవాలన్నారు.అన్ని రకాల వడ్లకు బోనాస్, రైతు భరోసా వచ్చేంత వరకు..రైతు రుణమాఫీ పూర్తి అయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.2 లక్షలకంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు… బేషరతుగా 2 లక్షలు చెల్లించాలన్నారు.సీఎం ప్రమాణం చేసిన అన్ని ఆలయాలలో చర్చలకు వెళ్తామన్నారు హరీష్.
Latest news,Telugu news,Telangana news