Nsnnews//హైదరాబాద్:ఏప్రిల్ 27
తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణా లు ఆసక్తిగా మారుతున్నా యి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది.
ఈ నేఫథ్యంలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది.ఇవాళ సీఎం నివాసంలో ముఖ్య మంత్రి సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు.
ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.