Nsnnews// పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో… ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ లో జరిగింది. గంగాపూర్ వాసి నాగరాజుకు విద్యుత్ శాఖలో ఉద్యోగం వచ్చిందని…గంగాపూర్ పోస్ట్ ఆఫీస్ కు ఇంటర్య్వూ లెటర్ వచ్చింది. అయితే పోస్టల్ సిబ్బంది కాల్ లెటర్ ను ఆలస్యంగా ఈ నెల 4న అందించారు. గత నెల 27న ఇంటర్య్వూ ఉండటంతో… అతను పోస్టల్ కార్యాలయానికి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.నాగరాజు పోస్ట్ ఆఫీస్ అధికారులను సంప్రదించి..తాను కోల్పోయిన ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఘటనపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని.. పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరిండెంట్ రవికుమార్ తెలిపారు.
Latestnews.Telugunews.Telanagananews