Nsnnews// సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని మండల కేంద్రమైన మిరుదొడ్డిలో అనారోగ్యంతో ఆరేటి బాలయ్య మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి నిరుపేద కుటుంబం అయినా బాలయ్య కుటుంబం ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే రైతు బీమా తో కుటుంబాన్ని ఆదుకున్నారని ఆయన అన్నారు. నిరుపేద కుటుంబమైన బాలయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కాజకిష్టయ్య మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి గుట్టం బైరయ్య దారా స్వామి దార మల్లయ్య ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Latestnews, Telugunews, Telangananews, Siddipetnews….