సిద్దిపేటలోని ఇందిరానగర్కు చెందిన హిజ్రా ప్రశాంతికి పొరుగు సేవ కింద జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం, న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి నియామకపత్రం అందజేశారు. హిజ్రాలకు సమాన హక్కు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలిసారి ఉద్యోగ అవకాశం కల్పించామని, వారు ఆత్మన్యూనతా భావానికి లోనవకుండా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.