Nsnnews// కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి…మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ హాజరయ్యారు. కార్యక్రమంలో. మద్ది చంద్రకాంత్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా.. మంత్రి జూపల్లి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారాయన. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టు చెప్పిన మంత్రి…10 లక్షల ఆరోగ్య భీమా అందించనున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం… ఇప్పటికే అర్హులైన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు. రెండు లక్షల పైన రుణమున్న వారికి… రుణమాఫీ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Latest news,Telugu news,Telangnaa news,Kamareddy District