Nsnnews// 17కోట్ల రామకోటి నామాలు పూర్తి చేసుకున్న సందర్భంగా…సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ హనుమాన్ ఆలయంలో..
రామకోటి బృందం అధ్యక్షుడు బచ్చు లక్ష్మణ్ ఆధ్వర్యంలో 18వ రామకోటి లిఖిత పూర్వక పుస్తకాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామకోటి బృందం అధ్యక్షుడు బచ్చు లక్ష్మణ్ మాట్లాడారు. లోక కల్యాణం కోసం…2017లో ప్రారంభించిన రామకోటి లిఖిత పూర్వక పుస్తకాలు 17 కోట్ల నామాలు ఇవాళ్టికీ పూర్తయినట్టు వారు తెలిపారు. ఆలయంలో ఇవాళ చేపట్టిన18వ కోటి లిఖితపూర్వక రామకోటి పుస్తక ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగినట్టు పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రమణ మాట్లాడుతూ… రామ నామంలో..శ్రీరాముడి మహిమను ఎంతో అద్భుతంగా వర్ణించారన్నారు. దైవ భక్తి కార్యక్రమాలను యువత ముందుండి నడిపించాలని సూచించారు. 18వ కోటి నామాల పుస్తకాల ఆవిష్కరణకు సహకరించిన పెందొట అరుణ-శ్రీనివాస చారి దంపతులను రామకోటి బృందం సభ్యులు అభినందించారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news