Nsnnews// విధి నిర్వాహణలో పోలీసులు తాకట్టుపెట్టిన త్యాగాలు వెలకట్టలేనివని…సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి వారి సేవలను స్మరించుకున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు సీపీ అనురాధ ఆధ్వర్యంలో.. జిల్లాలోని సీపీ కార్యాలయం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్.. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు…పోలీస్ అమరుల కుటుంబ సభ్యులతో కలిసి సీపీ, కలెక్టర్ పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబాలకు అండగా నిలువనున్నట్టు తెలిపారు. శాంతిభద్రతలు లోపించకుండా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల పాత్ర కీలకమన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే… పోలీసు అమర వీరులకు అందించే నిజమైన నివాళిగా వారు అభిప్రాయపడ్డారు. మహిళల రక్షణకు పోలీసుశాఖ పెద్దపీట వేసినట్టు చెప్పారు. సంస్మరణం సందర్భంగా…రక్త దాన శిబిరాలు, కొవ్వొత్తి ర్యాలీలు.. ఈ నెల 31 వరకు నిర్వహించనున్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news