Nsnnews// రాష్ట్ర వ్యాప్తంగా దేవి నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. భక్తులకు అన్నదానలు చేస్తూ…మండపం నిర్వాహకులు అమ్మవారికి ప్రత్యేక పూజాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసరపుర కాలనీలోయంగ్ స్టార్ యూత్ అధ్వర్యంలో కొలువుదీరిన దుర్గామాతకు మహిళలు, భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. 3వ వార్షికోత్సవం సందర్బంగా..దేవినవరాత్రులు జరుగుతున్న వేళ.. ఇవాళ్టీకిప్లాస్టిక్ నిషేధించాలన్న లక్ష్యంతో..అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు…సాంప్రదాయ పద్దతిలో..అరటిఆకు ప్రసాదం అందించారు. మానవ మనుగడను పెంపొందించేందుకే..ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ..ప్లాస్టిక్ రహిత దుర్గామాత మండపాలుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కాలుష్య నివారణ దిశగా..అరటిఆకు ప్రసాదం భక్తులకు వితరణ చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో…మండపం నిర్వాహకులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news