Nsnnews// ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ లో పర్యటిస్తున్నారు. బ్రూనై పర్యటన ముగించుకొని… సింగపూర్ చేరుకున్న ప్రధానికి అక్కడి భారతీయులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలను ఆసక్తిగా తిలకించిన మోడీ స్వయంగా డ్రమ్ వాయించి వారిని ఉత్సాహపర్చారు. సింగపూర్ లో ఇవాళ, రేపు పర్యటించనున్న ప్రధాని.. ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్ -సింగపూర్ స్నేహ బంధాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్చలు జరపనున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. ఇవాళ సింగపూర్ పార్లమెంటుకు వెళ్లనున్న ప్రధాని.. అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతోనూ సమావేశం కానున్నారు. సింగపూర్ లో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ను సందర్శించనున్న మోడీ… ఈ రంగంలో నైపుణ్య సహకారంపై ఆ దేశ ప్రధానితో ఒప్పందం చేసుకోనున్నారు.
Latest news,Telugu news,National news