Home బ్రేకింగ్ సముద్రమట్టానికి 5,300 ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ నుంచి డ్రోన్‌ ప్రదర్శన || A drone show from the base camp at 5,300 above sea level…

సముద్రమట్టానికి 5,300 ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ నుంచి డ్రోన్‌ ప్రదర్శన || A drone show from the base camp at 5,300 above sea level…

0
సముద్రమట్టానికి 5,300 ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ నుంచి డ్రోన్‌ ప్రదర్శన || A drone show from the base camp at 5,300 above sea level…

 

Nsnnews// ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని  అధిరోహించాలని చాలా మంది అనుకుంటారు. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోలేక కొందరు.. ఆర్థిక స్తోమతలేక ఇంకొందరు.. తమ చిరకాల కోరికను అణచివేసుకుంటారు. అలాంటి వారి కోసం చైనాకి చెందిన డ్రోన్‌ మేకర్‌ అద్భుతమైన వీడియో చిత్రీకరించాడు. డ్రోన్‌ సాయంతో అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈ వీడియో చూసిన వారెవరైనా వారెవ్వా.. అనాల్సిందే! అన్నట్లుగా ఉన్నాయీ దృశ్యాలు. సముద్రమట్టానికి 5,300 ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ నుంచి డ్రోన్‌ను ప్రయోగించారు. అక్కడి నుంచి శిఖరం అగ్రభాగం మీదుగా వెళ్తూ.. అక్కడి దృశ్యాలను డ్రోన్‌ చిత్రీకరించింది. ఎవరెస్టు శిఖరం ఎక్కుతున్న వారిని, దిగుతున్నవారిని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా శిఖరానికి సమీపంలో ఉన్న హిమనీ నదాలు, తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కనులవిందు చేస్తున్నాయి. ప్రకృతి అందాలతో అబ్బురపరుస్తోన్న ఆ వీడియోను మీరూ చూసేయండి.
Latestnews, Telugunews, Mount Everest.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here