Nsnnews//AP కాకినాడ: తాళ్లరేవు మండలం పరిధిలోని ఐదు పంచాయతీల రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదేళ్లుగా నీటి ఎద్దడిని ఎదుర్కొన్న రైతులు ఈసారి ముందుగానే ఇరిగేషన్ అధికారులను పంట వేయాలా, వద్దా అనే విషయాన్ని తేల్చాలంటూ సమావేశం నిర్వహించి మరీ నిలదీశారు.గతంలో తొలకరి, దాళ్వాలోనూ మిగులు జలాలు ఉండేవని.. ఇప్పుడు సాగుకే సరిపోవడంలేదని వాపోయారు. దీనికి కారణం అధికారులకు ముందుచూపు లేకపోవడమేనని ప్రశ్నించారు.
Latestnews, Telugunews, Kakinada, irrigation water…