NSN NEWS//
తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు, మార్కెట్ డైరెక్టర్ పూసపెల్లి శ్రీనివాస్, బండరామారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గడ్డం ఉప్పలయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ సంకినేని బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీతోనే సాధ్యమని, మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.