Nsnnews// వరదలకు ప్రభుత్వమే కారణమంటూ… వైఎస్సార్సీపీ విష ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ..విష ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు.
ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలన్నదే.. జగన్ లక్ష్యమని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. అధికారం అండతో జగన్ ఇసుక మాఫియా కోసం.. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేశారని గుర్తుచేశారు. 50 మందిని చంపేసి 5 ఊళ్లు నామరూపాలు లేకుండా చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని కూల్చేసి విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాల్లేకుండా చేయాలని చూశారన్నారు. లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందని తెలిపారు. మేరకు ఎక్స్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు.
Latest news,Telugu news,Andhra Pradesh news,Politics news