Home పాలిటిక్స్ వైకాపా పాలనతో రాష్ట్రం దివాలా.. డబ్బుల్లేని పరిస్థితి: ఏపీ సీఎం చంద్రబాబు || The state is bankrupt with Vaikapa rule.. the situation is without money: AP CM Chandrababu

వైకాపా పాలనతో రాష్ట్రం దివాలా.. డబ్బుల్లేని పరిస్థితి: ఏపీ సీఎం చంద్రబాబు || The state is bankrupt with Vaikapa rule.. the situation is without money: AP CM Chandrababu

0
వైకాపా పాలనతో రాష్ట్రం దివాలా.. డబ్బుల్లేని పరిస్థితి: ఏపీ సీఎం చంద్రబాబు || The state is bankrupt with Vaikapa rule.. the situation is without money: AP CM Chandrababu

 

Nsnnews// అనకాపల్లి: భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు  అన్నారు. ప్రజలు నిలవాలి.. రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం నిలదొక్కుకునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. వైకాపా పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని.. డబ్బుల్లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారు

‘‘తెదేపా హయాంలోనే పోలవరం 72 శాతం పూర్తిచేశాం. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో ప్రతి ఎకరాకూ నీరందుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.800 కోట్లు ఖర్చవుతుంది. దీని ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తిచేస్తాం. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని తీసుకురావొచ్చు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలి. ఈ జిల్లాకు సాగునీరందిస్తే నా జన్మ సార్థకం అవుతుంది. 

ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచుకున్నారు

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వంశధార వరకు వెళ్తుంది. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా నదులను అనుసంధానం చేయాలి. దాంతో రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తాం. అనకాపల్లి జిల్లాలో 3 చక్కెర కర్మాగారాలను పడకేసే పరిస్థితికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం చేయడం ఎన్డీయే కూటమి కర్తవ్యం. అబద్ధాలు చెప్పే నేతల వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఖండించాలి. కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచుకున్నారు. ప్రజల భూములన్నీ కొట్టేయాలనుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తున్నాం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం’’ అని చంద్రబాబు వివరించారు.
Latest news,Telugu news,Politics News,Andhra Pradesh News…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version