వివాహితపై కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. పట్టణంలోని ధోబీ కాలనీలో ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లాడు. ఇది గమనించిన మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు.