విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి
NSN NEWS,దౌల్తాబాద్:
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ కోనాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం తన నివాసంలో విద్యుత్తు రాకపోవడంతో వైర్లు సరి చేస్తుండగా మైలుగారి మల్లయ్య వయసు 55 ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు తన కుమార్తె రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ తెలిపారు.