Nsnnews// 18 వేల 500 వందల కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ సంబరాలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన వేయాలనుకున్న 18 వేల 500 వందల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ఆపిన సందర్భాన్ని పురస్కరించుకొని BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కామారెడ్డి BRS పార్టీ జిల్లా అద్యక్షులు ముజిబోద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రజల తరఫున ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో పాఠకులు, భానసంచలు కాల్చి సంబరాలు చేసుకున్న కామారెడ్డి నియోజకవర్గ BRS పార్టీ ప్రజాప్రతినిధులు, BRS పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడారు.
పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని BRS ప్రభుత్వానికి భిన్నంగా కేవలం 10 నెలల్లోపు 18 వేల 500 వందల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని ఈఆర్సిని ఒప్పించగలిగామని మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్షం యొక్క వాదనలోని సహేతుకతను, న్యాయాన్ని విని సంపూర్ణంగా చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్ సి తిరస్కరించడం ఇదే మొదటిసారి అని కేటీఆర్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఇలాంటి సందర్భం చారిత్రాత్మకం అన్నారు. రాష్ట్ర ప్రజల పైన అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా ఈ ఆర్సి ముందు ఉంచడంలో విజయం సాధించామన్నారు. పార్టీ అధినేత కేసిఆర్ గారి ఆదేశాల మేరకు స్వయంగా తనతో పాటు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు రాష్ట్ర ఈఆర్సీనీ కలిసి విద్యుత్ చార్జీల పెంపును ఆపాలని కోరారాని, ఆ తర్వాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారీ పాల్గొని ప్రజల తరఫున వాదనలను గట్టిగా వినిపించారన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ ,కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.
Latestnews, Telugunews, Telangana news, Kamareddy news..