Nsnnews// శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు..క్రీడలు దోహదం చేస్తాయని…కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలీటీ పరఇదిలోని లచ్చపేట మోడల్ పాఠాశాలలో..ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను..ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు.. క్రీడల్లో రాణించాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు..వెనకడుగు వేయ్యెద్దని సూచించారు. క్రీడల నిర్వహణకు..లక్ష50వేల రూపాయలు అందించిన కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డిని.. దుబ్బాక మండల విద్యాధికారి ప్రభుదాస్, ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత-భూంరెడ్డి, కౌన్సిలర్లు బంగారయ్య, వైస్ చైర్ పర్సన్ సుగుణ-బాలకిషన్‌లతో పాటు.. కౌన్సాలర్ శ్రీజ-శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, తహశీల్దార్ నల్ల వెంకట్ రెడ్డి,మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, జిల్లా క్రీడల సెక్రెటరీ సౌందర్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news