Home క్రైమ్ విద్యార్థులతో సైకో పీఈటీ బూతులు || Psycho pet toys with students

విద్యార్థులతో సైకో పీఈటీ బూతులు || Psycho pet toys with students

0
విద్యార్థులతో సైకో పీఈటీ బూతులు || Psycho pet toys with students

 

Nsnnews// విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుల వింత వికృత చేష్టాలతో విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. చదువు చెప్పే సైకో ఉపాధ్యాయుల వక్రబుద్ది మాత్రం మారడం లేదు. తాము స్నానం చేస్తున్న దృశ్యాలను.. పీఈటీ ఉపాధ్యాయురాలు ఫోన్‌లో చిత్రికరించి..అరాచకానికి పాల్పడుతుందంటూ..విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కళాశాలలో జోష్ణ పీఈటీగా పార్ట్ టైం విధులు నిర్వహిస్తోంది. హాస్టల్‌లో ఉంటూ చదువుతున్న తాము.. స్నానం చేస్తున్నప్పుడు వచ్చి…వీడియోలు తీస్తూ, ఎక్కడపడితే అక్కడ కొడుతూ చిత్ర హింసలకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థినీలు. బాత్రూం తలుపు పగులగొట్టి..తమను వేధిస్తున్న పీఈటీ ఇబ్బందులు తాళలేకనే..రోడ్డుపై బైఠాయించినట్టు చెప్పారు. క్రీడాలకు సంబంధించిన పాఠాలు నేర్పాల్సింది పోయి..తమతో అసభ్యకరంగా బూతులు మాట్లాడుతోందని…వెంటనే జోష్టను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంఘటన స్థలానికి చేరుకున్న మండల విద్యాధికారి, పోలీసులు..విద్యార్థులను నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అధికారుల మాట వినని విద్యార్థులు..తమకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరమించబోమని తేల్చి చెప్పారు.

Latest news,Telugu news,Telangana news,Rajanna Sirisilla district

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version