Nsnnews// రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించింది. ఆర్‌బీఐ ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తవడంతో.. విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయిలో విద్యార్థుల మేధాశక్తిని పరీక్షించేందుకు ‘ఆర్బీఐ-90’ పేరుతో ఈ క్విజ్ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్భీఐ ప్రకటించిన బహుమతులకు…ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 19 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు.
2024 సెప్టెంబరు 1 నాటికి 25 ఏళ్లలోపు వయసు కలిగి.. ఏదైనా కళాశాలలో డిగ్రీ చదువుతున్నవిద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చుననా స్పష్టం చేసింది. ప్రతి కాలేజ్ నుంచి ఎంతమంది విద్యార్థులైనా అప్లై చేసుకోవచ్చునని తెలిపిన ఆర్భీఐ..ఒక్కో టీమ్‌లో కనీసం ఇద్దరు విద్యార్థులు ఉండాలని పేర్కొంది. మొత్తం నాలుగు దశల్లో నిర్వహించే క్విజ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు.. లక్ష నుంచి 10 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో… రిజర్వు బ్యాంకు ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహనతోపాటు.. డిజిటల్ లావాదేవీలు, సురక్షిత బాధ్యతాయుత వినియోగం తదితరాలను.. ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ పోటీలను నిర్వహిస్తోంది.
Latestnews, Telugunews, RBI, Students, Quiz Competition…