Home చదువు విద్యార్థులకు పుస్తకాల మోత తల్లిదండ్రులకు ఫీజుల వాత..

విద్యార్థులకు పుస్తకాల మోత తల్లిదండ్రులకు ఫీజుల వాత..

0
విద్యార్థులకు పుస్తకాల మోత తల్లిదండ్రులకు ఫీజుల వాత..

విద్యార్థులకు పుస్తకాల మోత తల్లిదండ్రులకు ఫీజుల వాత – అన్నం ప్రవీణ్ – కాకతీయ యూనివర్సిటీ లా విద్యార్థి,,,.

 

 

 

 హుజురాబాద్ నియోజకవర్గం nsn ప్రతినిధి జమ్మికుంట పట్టణం

 

 

 

 

 

ప్రభుత్వ నిబంధనలను జీవోలను పెడచెవిన పెడుతూ ప్రైవేటు విద్యాసంస్థలు నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులను తల్లిదండ్రులను తీరని నష్టానికి గురి చేస్తున్నాయి.,

ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యా కమిటీ సమక్షంలో ఫీజులను నిర్ణయించాలి తప్ప, లాభార్జనే ధ్యేయంగా, వారి ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయించుకొని తల్లిదండ్రుల పాలిట శాపంగా మారాయి ఈ ప్రైవేట్ విధ్యా సంస్థలు.,

ప్రభుత్వ అనుమతి లేకుండా పెద్ద పెద్ద అక్షరాలతో రంగురంగుల డిజైన్లతో మైమరచిపోయే అబద్ధాలతో సీబీఎస్ఈ, ఐఐటి, మెడికల్, ఫౌండేషన్ కరికులం అంటూ ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షింపజేస్తూ వారి పాఠశాలలో చేర్చుకొని కనీస ప్రమాణాలు పాటించకుండా అర్హత లేని సిబ్బందిచే బోధిస్తూ నాణ్యతలేని విద్యను విద్యార్థులకు అందిస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు.,

మార్కెట్లో 500 నుంచి 1000 రూపాయలు విలువచేసే పాఠ్యపుస్తకాలను 5000ల నుంచి 10000ల వరకు అమ్ముతూ ఆ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అంటగట్టేందుకు సిద్ధమైన ప్రైవేటు విద్యాసంస్థలు బుక్ స్టాల్ లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు నష్టం చేసే ప్రయత్నాన్ని వెంటనే ఆపాలని తెలియజేశారు.,

ప్రైవేట్ విద్యాసంస్థలకు ఫీజుల మీద ఉన్న ధ్యాస పాఠ్య పుస్తకాల ద్వారా అక్రమంగా అధిక డబ్బులకు అమ్ముకుంటున్న దానిమీద ఉన్న సోయి విద్యార్థులకు అందించే నాణ్యమైన విద్య పట్ల వారికి అందించే మౌలిక సదుపాయాల పట్ల ఎందుకు బాధ్యత లేదని అన్నం ప్రవీణ్ ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రశ్నించారు.,

కాలం చెల్లిన పాఠశాల వ్యాన్లను ఉపయోగిస్తూ అనుభవం లేని డ్రైవర్లను నియమించి ఆ వ్యాన్లలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నం ప్రవీణ్ తెలిపారు.,

విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేటు విద్యాసంస్థలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులకు అందించాల్సినటువంటి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, హెచ్ఐవి, బాధిత వర్గాల విద్యార్థులకు 25% పాఠశాల కోటాలో ఉచిత విద్యను అందించాల్సి ఉన్న ఎందుకు అందించడం లేదని తక్షణమే దానిమీద వివరణ ఇవ్వాలని అడిగారు.,

కాకతీయ యూనివర్సిటీ లా విద్యార్థిగా తెలంగాణ ఉద్యమకారునిగా విద్యాశాఖ అధికారులకు సూచిస్తున్నా .,ఈ అంశాల పట్ల వెంటనే స్పందించాల్సిన వంటి అవసరం ఉందనీ అన్నం ప్రవీణ్ న్యాయబద్ధంగా కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు చేస్తే ఊరుకోమని అన్నం ప్రవీణ్ హెచ్చరించారు.,

ప్రభుత్వ జీవోలను పాటించేలా ప్రభుత్వ నిబంధనలను ఆచరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిబంధనల పట్ల జీవోల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి విద్యాసంస్థలపై వెంటనే గుర్తింపు రద్దు చేసే శాఖపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యాధికారులను అన్నం ప్రవీణ్ కోరారు.

వెంటనే ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలల మీద చర్యలు తీసుకోకపోతే తదుపరి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయనున్నట్లు అన్నం ప్రవీణ్ తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ లా విద్యార్థి అన్నం ప్రవీణ్ తో పాటు బిజిగిరి శ్రీకాంత్, గైకోటి రాజు, బుడిగే శ్రీకాంత్, కారింగుల రాజేందర్, పచ్చిమట్ల భాను, దిలీప్, పోతరాజు రాజు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here