Nsnnews// పాఠాలు చెప్పాల్సిన స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయిని ఏకంగా ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొంది. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెపై కేసు నమోదు చేశారు. అమెరికా(USA)లోని న్యూజెర్సీలో ఫ్రీహోల్డ్ ఇంటర్మీడియట్ పాఠశాలలో 43 ఏళ్ల ఎలీసన్ హవెమాన్ అనే మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది మొదటినుంచి ఆమె విద్యార్థులను లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమె మాన్‌హట్టన్ కౌంటీ జైలులో ఉంటోంది.
అక్కడి పోలీసులు బాధితుడైన మైనర్ పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు. ఆమె బాధితులు ఇంకెవరైనా ఉన్నారేమోనని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పాఠశాల నుంచి ఆమెను తొలగించారు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు వెల్లడించారు. ఇక ఎలీసన్ లాయర్ మాత్రం తన క్లయింట్ నిర్దోషి అని చెబుతున్నాడు.
లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో మాత్రం ఎలీసన్ తనను తాను ఎంతో మంచి టీచర్‌గా పేర్కొంది. ఫలితాల కోసం పనిచేసే సిన్సియర్ ఎడ్యుకేటర్‌నని వెల్లడించింది. ఆమె 2022 నుంచి ఫ్రీహోల్డ్ స్కూల్లో పనిచేస్తోంది. అంతకు ముందు పలు పాఠశాలల్లోను విధులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆమె వద్ద 6 నుంచి 8వ గ్రేడ్ విద్యార్థులు చదువుకొంటారు. వీరి వయస్సు 14ఏళ్ల లోపే ఉండొచ్చు.
Latest news,Telugu news,International , USA…