వారికి ఐటీ శాఖ కీలక సూచనలు
ఆధార్-పాన్ లింక్ చేయని వారికి ఐటీ శాఖ కీలక సూచనలు చేసింది. మే 31 లోగా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి చర్యలు ఉండవని తెలిపింది. పన్ను చెల్లింపుదారుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలకు సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలు ఉంటుందని స్పష్టం చేసింది. ఐటీ నిబంధనల ప్రకారం లింక్ చేయకపోతే రెండింతల టీడీఎస్ కోతలుంటాయి.