Nsnnews// కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంకలోని వరద బాధితులకు విద్యా కుటుంబం అండగా నిలిచింది. అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. సుమారు 29 లక్షల 78వేల 185 రూపాయల విరాళలతో వంటపాత్రలు, కుక్కర్లును అందజేశారు. వాటిని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో 2 వేల 600 బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు.
Latest news,Telugu news,Andhra Pradesh news