Nsnnews// భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి నగర శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది. గత నెల 15న ఆమె స్వస్థలానికి చెందిన తెలిసిన యువకుడొకరు ఆమె వసతిగృహం వద్దకు వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ ఆమెను కారులో ఎక్కమన్నాడు. అప్పటికే అందులో మరో ఇద్దరు యువకులు ఉండటంతో యువతి నిరాకరించినా.. బలవంతంగా కారులో నగరానికి తీసుకొచ్చారు. వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఒక లాడ్జి మొదటి అంతస్తులో గది తీసుకున్నారు. అక్కడ యువతికి బీర్లు తాగించి ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాలేజీలో పరీక్షలుండటంతో ఫిర్యాదు చేయలేదని, సెలవులకు ఇంటికి వెళ్లిన తర్వాత అత్యాచారం విషయాన్ని యువతి తల్లికి చెప్పిందని సమాచారం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లి, కుమార్తె.
Latest news,Telugu news,Telangana news,Crime news