Nsnnews// సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని తొగుట మండలం కేంద్ర పరిధిలోని జప్తి లింగారెడ్డి పల్లి లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ
దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తొగుట మండలం జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు జరపాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్లకి క్వింటాల్ కి 2,320 రూపాయలను రైతులకు చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి,మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ చెరుకు విజయ్ రెడ్డి,(అమర్) మాజీ ఎంపీపీ గంట రేణుకా రవీందర్,మాజీ వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోచయ్య,మాజీ సర్పంచులు కొండల్ రెడ్డి,బుర్ర నర్సింలు,పబ్బతి మల్లారెడ్డి,శ్రీనాకర్ రెడ్డి,ఉప్పలయ్య,కృష్ణ,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయి కుమార్, జగన్నాథ్ రెడ్డి, రంగారెడ్డి, భూపతిరెడ్డి, మరియు రైతులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Latestnews, Telugunews, Telangananews, Siddipetnews…