Home బ్రేకింగ్ లడ్డూ అపవిత్రతపై పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష | Deputy CM Pawan Kalyan Start 11Days Deeksha

లడ్డూ అపవిత్రతపై పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష | Deputy CM Pawan Kalyan Start 11Days Deeksha

0
లడ్డూ అపవిత్రతపై పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష | Deputy CM Pawan Kalyan Start 11Days Deeksha

 

 

Nsnnews// పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం.. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని.. పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. లడ్డుకు ఉపయోగించే నెయ్యి.. జంతు అవశేషాలతో మాలిన్యమైందని, ఈ పాపాన్ని ముందుగానే పసిగట్టకపోవడం హైందవ జాతికే కళంకంగా భావిస్తున్నట్టు చెప్పారాయన.

లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు కలిశాయని తెలిసిన తన మనసు వికలమైందని, అపరాధ భావానికి గురైందని..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. ఈ విషయం తనకు ముందుగానే తెలియకపోవడం తనని బాధించిందని అన్నారు. సనాతన ధర్మాన్ని నమ్మే.. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారాన్ని.. సనానత ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితంగా చేసుకోవాలని పవన్ అన్నారు. ఈ సందర్భంగా తాను ప్రాయశ్చిత దీక్ష చేయాలని సంకల్పించానని పవన్ వెల్లడిచారు. ఇవాళ్టీ నుంచి 11 రోజుల పాటు.. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. 11 రోజల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని ట్వీట్‌లో పేర్కొన్నారు. గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వాలని వేడుకుంటాన్నారు. ఈ సందర్బంగా..వైసీపీ నిర్వాకాన్ని ఎండగట్టారు పవన్. జాతీయ స్థాయిలో రాజకీయ నేతలు, న్యాయవ్యవస్థ, ప్రజలు, మీడియా, మతాధిపతులంతా కలిసి.. ఒక చర్చ వేదికను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇలాంటి అపవిత్రమైన చర్యలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

Latest news,Telugu news, Andhra Pradesh news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here