Nsnnews// రైతులకు తక్షణమే..రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. నిజంసాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు..రైతులతో కలిసి ప్రభుత్వదిష్టిబొమ్మదగ్ధం చేశాయి. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, TSPSC మాజీ సభ్యుడు సుమిత్ర ఆనంద్ మాట్లాడారు. రైతులకు ఇస్తానని చెప్పిన రైతు భరోసా ఇవ్వకుండా…రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల మోసపూరిత వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. ఎకరానికి 15వేల రూపాయలు ఇస్తానని చెప్పి 10 నెలలు గడుస్తున్నప్పటీకి రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించలేదని ఆరోపించారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు.
latestnews, telugunews, telangananews, politicalnews, kamareddynews….