Nsnnews// కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడిగా.. పైడి విట్టల్ రెడ్డి ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పైడి విట్టల్ రెడ్డి, సాయి రెడ్డి, రాజేష్‌లు మాట్లాడారు. రైతులకు వెన్నంటే తోడుంటూ..వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 5న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే..ఛలో కామారెడ్డి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Latest news,telugu news,Telangana news,Kamareddy District