Home Blog రేవంత్ రెడ్డి కుర్చీ లాగడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు  రేవంత్ రెడ్డి దొంగ వీడియోలు తయారు చేశాడు  రోడ్ షో లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు 

రేవంత్ రెడ్డి కుర్చీ లాగడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు  రేవంత్ రెడ్డి దొంగ వీడియోలు తయారు చేశాడు  రోడ్ షో లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు 

0
రేవంత్ రెడ్డి కుర్చీ లాగడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు   రేవంత్ రెడ్డి దొంగ వీడియోలు తయారు చేశాడు   రోడ్ షో లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు 

రేవంత్ రెడ్డి కుర్చీ లాగడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు 

రేవంత్ రెడ్డి దొంగ వీడియోలు తయారు చేశాడు 

రోడ్ షో లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు 

 

NSN NEWS:

రూ 2 లక్షల రుణమాఫీ చేయడానికి, ఖాళీ లంక బిందెలు ఉంటే రేవంత్ రెడ్డి రూ 2 లక్షల జీతం ఎందుకు తీసుకుంటున్నాడని బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. కెసిఆర్ మోడీ, ఈడి, బోడి అంటే కవిత జైలుకు వెళ్లిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నాడని ఆయన తెలిపారు. సిద్దిపేట లో అమిత్ షా రిజర్వేషన్ల గురించి మాట్లాడని, మాటలను దొంగ వీడియోను రేవంత్ రెడ్డి తయారు చేశారని ఆరోపించారు. ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇస్తే సైనికులను తీసుకొని రమ్మంటున్నాడని, రేవంత్ రెడ్డిని ఎత్తడానికి ఇద్దరు కానిస్టేబుల్స్ చాలు అని విమర్శించారు.సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్, నారాయణరావుపేట మండల కేంద్రంలో రోడ్ షో లో పాల్గొని రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కెసిఆర్ జుట్ల కేళీ రేవంత్ రెడ్డి వచ్చారని, కెసిఆర్ ఒక్కటి మాట్లాడితే రేవంత్ రెడ్డి రెండు మాట్లాడుతున్నాడని రఘునందన్ తెలిపారు. రేవంత్ రెడ్డి వచ్చి ఆరు నెలలు కాలేదు ఆయన కుర్చీ లాగడానికి బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మీద ఒట్టు వేసి మాట్లాడుతున్నాడని అన్నారు. 13న జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని రఘునందన్ రావు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here