Home జిల్లా వార్తలు రేవంత్ బీఆర్ఎస్‌ను విమర్శించి..కాంగ్రెస్‌ను ఖతం చేస్తాడు..!! || Revanth criticizes BRS and destroys Congress..!!

రేవంత్ బీఆర్ఎస్‌ను విమర్శించి..కాంగ్రెస్‌ను ఖతం చేస్తాడు..!! || Revanth criticizes BRS and destroys Congress..!!

0
రేవంత్ బీఆర్ఎస్‌ను విమర్శించి..కాంగ్రెస్‌ను ఖతం చేస్తాడు..!! || Revanth criticizes BRS and destroys Congress..!!

 

Nsnnews// సీఎం రేవంత్ రెడ్డి…టీడీపీ, బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్నాడని..సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మాజీ వైస్ యంపీపీ కీసరి పాపయ్య, బీఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ విమర్శించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్..ఎన్డీఏ కూటామిలో విలీనం అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల నుంచి ప్రజల చూపు మరల్చేందుకే…హైడ్రా పేరుతో డ్రామా షురూ చేశారని ఆరోపించారు. హైడ్రా కూల్చివేతలతో ఆత్మహత్య చేసుకుని మరణించిన..మూసీ బాధితురాలు బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితరెడ్డిలను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటాన్నారు. బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డి విమర్శించడం చూస్తుంటే.. కాంగ్రెస్‌ను ఖతం చేసి చంద్రబాబు, బీజేపీలతో జత కట్టేలా కన్పిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నాయకులు పడిగె ప్రశాంత్, గుజ్జ రాజు, రావుల రాజు, పడిగె లింగంలు పాల్గొన్నారు.

Latest news,telugu news,Telangana news,Siddipet news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version