Nsnnews// వారంలో రెండ్రోజులు గాంధీభవన్‌లో.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కో మంత్రి అందుబాటులో ఉండే కార్యక్రమం.. రేపటి నుంచి ప్రారంభం కానుంది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
దామోదర రాజనర్సింహతో రేపు మొదలవనుంది. శుక్రవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. గాంధీభవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ నేపథ్యంలోనే వారి వారి సమస్యలను తెలుసుకుని మంత్రులు పరిష్కరిస్తారని.. గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. వచ్చే వారం బుధవారం గాంధీ జయంతి సందర్భంగా విరామం ఇచ్చారు. ఆ తర్వాత శుక్ర, బుధవారాల్లో వరుసగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో పాటు.., కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావులు.. గాంధీభవన్‌లో కార్యకర్తలకు సమయం కేటాయించనున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం గత శుక్రవారమే ప్రారంభం కావాల్సి ఉండగా.. మంత్రివర్గ సమావేశం కారణంగా.. రేపటీకి వాయిదా పడింది.
Latest news,Telugu news,Telangana news,Politics news