Nsnnews// హైదరాబాద్: రుణయాప్ మోసాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నాంపల్లి ఎంఎస్‌జే కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. పలు నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఫిన్‌టెక్ కంపెనీలపై అభియోగాలు మోపింది. 2020-21లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన 43 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ.. కీలక వివరాలతో తాజాగా అభియోగాలు నమోదు చేసింది. సెల్‌ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు అనుమతులు పొంది రుణాలను ఇచ్చిన పలు సంస్థలు రుణగ్రహీతలకు భారీగా వడ్డీ విధించి వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. నిర్వాహకుల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు యువకులు ఆత్మహత్యలకు పాల్పడటం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఇప్పటికే పలు కంపెనీలకు చెందిన రూ.346.86 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. మరో రూ.434 కోట్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ తాజాగా ప్రకటించింది.
Latest news,Telugu news,Crime news