Nsnnews// హైదరాబాద్: రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల అరెస్టు హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజాపాలన అంటూ అప్రజాస్వామిక విధానాలు పాటిస్తారా అని నిలదీశారు.
‘‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేస్తున్నారు. రైతులు రుణమాఫీ కాలేదని కలెక్టరేట్లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. రైతు బంధు రాక.. రుణమాఫీ కాక.. అన్నదాత ఆవేదనలో ఉన్నాడు. వాళ్లు పొలం పనులు చూసుకోవాలా.. రుణమాఫీ కోసం తిరగాలా? అరెస్టయిన రైతులకు మా పార్టీ అండగా నిలుస్తుంది’’ అని హరీశ్‌రావు తెలిపారు.
Latest news,Telugu news,Politics News,Telangana News,BRS,Harishrao