Nsnnews// మంచిర్యాల – నెన్నెల మండల కేంద్రానికి చెందిన రైతు శివలింగయ్య 2019లో ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంకు బెల్లంపల్లి శాఖ నుంచి రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. మూడు కిస్తీలుగా రూ.80 వేలు తిరిగి చెల్లించాడు. గతేడాది పంటలు పండక పోవడం, కూతురు పెళ్లి చేయడంతో కిస్తీ డబ్బులు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఈ ఏడాది పంట చేతికి రాగానే చెల్లిస్తానని తెలిపాడు. అయితే పంటకాలం పూర్తి కాకముందే.. శివలింగయ్య ఇంటికి వచ్చిన బ్యాంకు అధికారులు రుణం చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో రైతు బయట డబ్బులు తీసుకురావ డానికి వెళ్లాడు. ఇంతలో అధికారులు రైతు ఇంటి తలుపులు తొలగించారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి భూమి కోసం రుణం ఇచ్చి.. ఇంటిపై దౌర్జన్యం చేయడం ఏంటని నిలదీశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైతు ఇంటికి వచ్చేసరికి తలుపులు తొలగించి ఉండటంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కు ఫిర్యాదు చేశాడు.
Latest news,Telugu news,Telangana news,Mancherial news