Nsnnews// రైతు భరోసాపై బీఆర్ఎస్ నిరసన చేపట్టడంపై…కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీటిసి నారెడ్డి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డిలు మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కుంటుపడిన అభివృద్ధి…10నెలల కాంగ్రెస్ హయాంలో జరిగిందన్నారు. తమ ప్రభుత్వం…మరో 15 రోజుల్లో రైతులకు 2లక్షల రుణమాఫీ చేయనున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై…బీఆర్ఎస్ బహిరంగ చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు.
Latest news,Telugu news,Telangana news,Kamareddy District