Home బ్రేకింగ్ ‘రానా నాయుడు 2’.. అప్‌డేట్‌ షేర్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్‌ || ‘Rana Naidu 2’.. Update shared by Netflix…

‘రానా నాయుడు 2’.. అప్‌డేట్‌ షేర్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్‌ || ‘Rana Naidu 2’.. Update shared by Netflix…

0
‘రానా నాయుడు 2’.. అప్‌డేట్‌ షేర్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్‌ || ‘Rana Naidu 2’.. Update shared by Netflix…

 

Nsnnews// రానా , వెంకటేశ్‌  ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’ . నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్‌ అత్యధిక వ్యూస్‌తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌ను తీయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ గతంలోనే ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను సంస్థ షేర్‌ చేసింది. సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభమైనట్లు తెలిపిన నెట్‌ఫ్లిక్స్ చిత్రీకరణ జరుగుతోన్న చిన్న వీడియోను షేర్‌ చేసింది. అందులో రానా, వెంకటేశ్‌ల మధ్య యాక్షన్‌ సన్నివేశాలు జరుగుతున్నట్లు చూపించారు. దీంతో త్వరలోనే సీజన్‌ 2 ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. గతంలో సీజన్‌ 2 గురించి నెట్‌ఫ్లిక్స్‌ బృందం ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ లభించిందని దానిని దృష్టిలోపెట్టుకొనే సీజన్‌-2ను ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తున్నామని తెలిపింది. మరెన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో ‘రానా నాయుడు-2’ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. దీనిపై పలువురు సినీ ప్రియులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
Latestnews, Telugunews, web series…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version