Home బ్రేకింగ్ ‘రాజీనామాకు నేను సిద్ధమే’: మమతా బెనర్జీ || ‘I am ready to resign’: Mamata Banerjee..

‘రాజీనామాకు నేను సిద్ధమే’: మమతా బెనర్జీ || ‘I am ready to resign’: Mamata Banerjee..

0
‘రాజీనామాకు నేను సిద్ధమే’: మమతా బెనర్జీ || ‘I am ready to resign’: Mamata Banerjee..

 

Nsnnews// కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకు, మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన నెలకొంది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. సమ్మె విరమించాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ మంత్ సైతం… ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను అనధికారిక చర్చలకు ఆహ్వానించారు. బెంగాల్ ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా పరిష్కారం దొరుకుతుందని అశిస్తున్నానని మమతా బెనర్జీ అన్నారు. వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకురాలేకపోయినందుకు.. వారికి క్షమాపణలు చెబుతున్నానని ఆమె చెప్పారు. అయితే, మమతా బెనర్జీ కోసం రెండు గంటల 10 నిమిషాలు వేచి ఉన్నప్పటికీ, వైద్యులు చర్చలకు సిద్ధంగా లేకపోవడంతో, మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు.

ప్రజలకు క్షమాపణలు చెప్పి తిరిగి విధుల్లో చేరాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తాను న్యాయం చేసేందుకు రాలేదన్నారు. వారికి కుర్చీ కావాలి. ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి పదవి వద్దని తెలిపిన మమతా… దోషులను విచారించాలని కోరుతున్నట్టు చెప్పారు. సామాన్యులకు న్యాయం జరగాలంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావోద్వేగానికి లోనయ్యారు. బెంగాల్ ప్రజలకు ముకుళిత హస్తాలతో క్షమాపణలు చెబుతున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం అన్నారు. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలిపై అఘాయిత్యం,..హత్య ఉదంతంపై దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Latestnews, Telugunews, Kolkata junior doctor murder case…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here