జిల్లా పోలీసు కార్యాలయం
సంగారెడ్డి జిల్లా
పత్రిక ప్రకటన తేది: 21-04-2024,
• రాజకీయ హత్య కాదు.. సిర్గాపూర్ మండల సింగార్ బోగ్డ తండాలో CC రోడ్డు వెయ్యగా మిగిలిన కంకర గురించి జరిగిన గోడవలో భాగంగా శ్రీను నాయక్ అనే వ్యక్తి మృతి చెందినట్లు నారాయణఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి గారు వివరించారు.
ఈ సందర్భంగా డియస్పి గారు మాట్లాడుతూ.. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాక మునుపే గ్రామసభ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి, సింగార్ బోగ్డ తండాలో CC రోడ్డు వేయుటకు తీర్మానించడం జరివగింది. ఆతరువాత కాంట్రాక్టర్లు అదే తాండాకు చెందిన జాదవ్ రాజు, సిర్గాపూర్ గ్రామానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి గ్రామీణ ఉపాది హామీ పధకం కిందా CC రోడ్డు పనులను ప్రారంభించి, AE మాదవ నాయుడు, DE మదుసూదన్ రెడ్డి పర్యాయవేక్షణలో ఆ పనులను ఈ మద్యకాలంలో పూర్తి చేయడం జరిగింది. అట్టి CC రోడ్డు పనుల కొరకు ఉపయోగించిన కంకర మిగిలిపోవడంతో కాంట్రాక్టర్ జాదవ్ రాజు మిగిలిన కాంట్రాక్టర్ల అంగీకారంతో అట్టి కంకరను అమ్మివేయగా, ఆ కంకరను కొన్న వారు తీసుకొని వాళ్లుతుండగా అదే గ్రామానికి చెందిన వడిత్య శ్రీను నాయక్ తండ్రి పండరి, అడ్డుపడడంతో కాంట్రాక్టర్ జాదవ్ రాజు మరియు శ్రీను నాయక్ తండ్రి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత రోజు నిన్న తేది: 20.04.2024 నాడు పెద్దల సమక్షంలో తాండాలో పంచాయతీ మాట్లాడుతున్న సమయంలో ఇరు కుటుంబ సభ్యుల మధ్యన మాట మాట పెరిగి జాదవ్ రాజు, అతని తమ్ముళ్ళు, వారి పిల్లలు కలిసి శ్రీనునాయక్, అతని తండ్రి పండరీని, గోపాల్, రవి లను కర్రలతో, రాళ్ళతో కొట్టగా తీవ్ర గాయలైన శ్రీనునాయక్ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకోవెల్లగా అక్కడి డ్యూటి డాక్టర్ చూసి మృతి చెందినట్లు నిర్ధారించారాని మృతిని తండ్రి పండరీ సిర్గాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినారు.
శ్రీను నాయక్ కుటుంబ సభ్యులు బి.ఆర్.ఎస్ పార్టీ కి చెందిన వారని చెపుతూ.. నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి (బి.ఆర్.ఎస్ పార్టీ) గారు అది రాజకీయ కక్షలతో జరిగిన హత్య అని ఆరోపిస్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యం లేదు. మృతుని తండ్రి పోలీసు వారికి ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడ కూడా రాజకీయ కక్షతో చంపినట్లు పేర్కొనలేదు. గ్రామంలో వేసిన CC రోడ్డు పనులకు సంబంధించి కంకరను అమ్మ చూసిన కాంట్రాక్టర్ జాదవ్ రాజు కుటుంబ సభ్యులకు మరియు శ్రీనునాయక్ కుటుంబ సభ్యులకు మద్య జరిగిన గొడవలో భాగంగా జాదవ్ రాజు కుటుంబ సభ్యులు శ్రీను నాయక్ ను కొట్టి చంపినట్లు డి.ఎస్.పి వెంకట్ రెడ్డి గారు వివరించారు.