ఈరోజు సిద్దిపేట రూరల్ మండలంలోని రఘవాపూర్ గ్రామంలో NSUI మండల అధ్యక్షులు గ్యార రఘుపతి మహారాజ్ ఆధ్వర్యంలో రాఘవపూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీని ఎకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.. అధ్యక్షులుగా -పిట్ల వెంకటి, ఉపాధ్యక్షులుగా – గ్యార బాబు, ప్రధాన కార్యదర్శిగా తాడేపు లింగం, కార్యదర్శులుగా గొడుగు రామచంద్రం, సుర శ్రీనివాస్,సలహాదారులుగా బండి కనకయ్య, తాడేపు మురళి, కార్యవర్గ సభ్యులుగా మిట్టపల్లి రాజయ్య, క్యాతం చంద్రయ్య, గొడుగు బాలరాజ్, డప్పు యాదయ్య గార్లకు కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు గరిపల్లి రాములు, జిల్లా నాయకులు మంద పండు గారి చేతుల మీదిగా నియామక పత్రాలు అందజేశారు… ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ మాట్లాడుతూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికి ధన్యవాదములు తెలియజేసారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి మేమంతా కృషి చేస్తు కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదరి బండి శివకుమార్, సంయోద్దీన్, పుల్లూరు బండ చైర్మన్ కనకయ్య,సంపంగి బుగ్గరాజు, అనపురం మహేష్, సంపంగి శేఖర్, గ్యార లింగం, కనకరెడ్డి, మిద్దె స్వామి, శ్రీరాములు, శ్రీనివాస్, ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..