Nsnnews// రష్యా ప్రభుత్వం తాజాగా 85మంది భారతీయుల్ని సైనిక విధుల నుంచి తప్పించినట్టు భారత్ తెలిపింది. దురదృష్టవశాత్తు ఉక్రెయిన్ యుద్ధంలో మృతిచెందిన పలువురి మృతదేహాలనూ.. రష్యా మనకు అప్పగించినట్టు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. మరో 20 మందిని త్వరలో విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. రష్యాలోని కజాన్ నగరంలో ఇవాళ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా.. రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయుల సమస్యను… భారత అధికారులు రష్యా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మాస్కోలో మోదీ జులైలో పర్యటించినప్పుడు… ఈ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. కాగా రష్యా వెళ్లిన కొందరు భారతీయులు సైన్యంలో పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఉక్రెయిన్ తో పోరాటంలో చనిపోతుండటంతో వారిని వెనక్కిరప్పించేందుకు భారత్ యత్నిస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు ఉక్రెయిన్ యుద్ధంలో 9 మంది భారతీయులు మరణించారు.
latestnews, telugunews, nationalnews….