Nsnnews// యువత ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయంకృషితో ఎదిగేలా కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. MP మల్లు రవి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన.. అవగాహన సదస్సుకు జూపల్లి హాజరయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని… బ్యాంకు రుణాల పొంది పారిశ్రామిక వేత్తలుగా రాణించాలని జూపల్లి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతీ, యువకులకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుందని.. ఎంపీ మల్లు రవి వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామని వివరించారు.
Latestnews, Telugunews, Telangananews, Jupalli KrishnaRao…