Home జాతీయం యాడ్స్‌ వివాదం.. రామ్‌దేవ్‌ బాబాపై ధిక్కరణ కేసు మూసివేత || Ads dispute.. Contempt case against Ramdev Baba closed

యాడ్స్‌ వివాదం.. రామ్‌దేవ్‌ బాబాపై ధిక్కరణ కేసు మూసివేత || Ads dispute.. Contempt case against Ramdev Baba closed

0
యాడ్స్‌ వివాదం.. రామ్‌దేవ్‌ బాబాపై ధిక్కరణ కేసు మూసివేత || Ads dispute.. Contempt case against Ramdev Baba closed

 

Nsnnews// ఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనల (Misleading Ads Case) వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ ప్రకటనలకు సంబంధించి యోగా గురువు, సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా , ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇకపై అలాంటి యాడ్స్‌ ఇవ్వబోమని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం .. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది. అయితే, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.
ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి పై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ (IMA) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. దీంతో ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, వాటిని ఉల్లంఘించడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వారిపై ధిక్కరణ చర్యలు చేపట్టింది.
దీంతో రామ్‌దేవ్‌ బాబా , బాలకృష్ణ పలుమార్లు కోర్టుకు హాజరై బేషరతుగా క్షమాపణలు చెప్పారు. వాటిని అంగీకరించని అత్యున్నత న్యాయస్థాం.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే రెండు సార్లు వార్తా పత్రికల్లో ఈ సంస్థ క్షమాపణల ప్రకటనలు ఇచ్చింది. భవిష్యత్తులో ఇలా తప్పుదోవ పట్టించే యాడ్స్‌ చేయబోమని తెలిపింది.
Latest news,Telugu news,National news,Supreme Court…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version